ఆగష్టు 20న ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల భేటీ

ఆగష్టు 20న ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల భేటీ
  • ఓటు వేయాలని అభ్యర్థించనున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: సంసద్ భవనం (ఓల్డ్ పార్లమెంటు బిల్డింగ్)లో ఇండియా కూట మి ఎంపీల సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేయాలని కూటమి ఎంపీలను జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థించనున్నారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. కాగా, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సంసద్ భవనంలో సమా వేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొని.. తనకు ఓటు వేయాలని ఎంపీలందరినీ కోరనున్నారు.