ఏడు దేశాలకు మన బియ్యం ఎగుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏడు దేశాలకు మన బియ్యం ఎగుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏడు దేశాలకు బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత దృష్ట్యా అవసరాలున్న కొన్ని దేశాలకు సుమారు 10 లక్షల టన్నుల బియ్యాన్ని ఏడు దేశాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. 

నేపాల్, కామెరూన్, మలేషియా సహా ఏడు దేశాలకు వాటి అవసరాలను బట్టి 10 లక్షల 34 వేల 800 టన్నలు నాన్ బాస్మతి వైట్ రైస్ ఎగుమతులకు అనుమతించినట్లుకేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఎగుమతికి అనుమతి ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తెలిపింది. దేశ ప్రజల అవసరాల దృష్ట్యా... 2023 జూలై 20 న బాస్మతీయేత బియ్యం ఎగుమతులను నిషేదించినప్పటికీ కొన్ని దేశాల ఆహార భద్రత అవసరాలు తీర్చడానికి బియ్యం ఎగుమతి చేస్తోంది. 

Also Read :- ఛీ..ఛీ..రైలు వంటగదిలో ఎలుకలు

నేపాల్ కు రూ. 95వేల టన్నులు, కామెరూన్ కు 1లక్షా 90 వేల టన్నులు, కోట్ డీ ఐవోర్ కు 1లక్షా 40 వేల టన్నులు, గినియా 1 లక్షా40 వేల టన్నులు, మలేషియాకు లక్షా 70 వేల టన్నులు, పిలిప్పీన్స్ కు 2లక్షల 90వేల టన్నులు, సీషెల్స్ కు 800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.