సౌతాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. బుధవారం (డిసెంబర్ 3) 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును లీడ్ చేయనున్నాడు. గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో గాయం కారణంగా దూరమైన గిల్.. పూర్తి ఫిట్ నెస్ సాధించి స్క్వాడ్ లో చేరాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఈ సిరీస్ ప్రాక్టీస్ గా ఉపయోగపడనుంది. టీ20 వరల్డ్ కప్ కు కూడా దాదాపు టీమిండియా ఇదే జట్టుతో వెళ్లే అవకాశం ఉంది.
ఆసియా కప్ ఫైనల్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులో చేరాడు. పాండ్య పూర్తి ఫిట్ నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనను తాను నిరూపించుకున్నాడు. పని భారం కారణంగా ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా స్క్వాడ్ లో ఎంపికయ్యాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పై వేటు పడింది. బ్యాకప్ ఓపెనర్ గా సంజు శాంసన్ ఉండడమే ఇందుకు కారణం. పేలవ ప్రదర్శన కారణంగా ఫినిషర్ రింకూ సింగ్ కు స్క్వాడ్ లో చోటు దక్కలేదు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, వాషింగ్ టన్ సుందర్
డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్:
ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5⃣-match T20I series against South Africa announced.
— BCCI (@BCCI) December 3, 2025
Details ▶️ https://t.co/3Bscuq6Gri #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0bHLCcbwTD
