
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో హెచ్సీఎల్, ఫాక్స్ కాన్ కంపెనీల జాయింట్వెంచర్ ‘చిప్ అసెంబ్లీ యూనిట్’ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఆమోదం తెలిపిన వాటిలో ఇది ఆరోవది. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. మొబైల్ఫోన్లు, ల్యాప్ టాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే డ్రైవర్ చిప్ లను ఈ ప్లాంట్ లో తయారుచేస్తారని చెప్పారు.
ఈ యూనిట్ కోసం రూ.3,706 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ అవుట్‌సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ యూనిట్ నెలకు 20,000 వేఫర్లను అసెంబుల్ చేస్తుంది, నెలకు 36 మిలియన్ యూనిట్ల డిజైన్ అవుట్‌పుట్ సామర్థ్యంతో పనిచేస్తుందని చెప్పారు. యూనిట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివరించారు.