IND vs SA: ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా.. సఫారీలపై ఘన విజయం సాధించిన కౌర్ సేన

IND vs SA: ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా.. సఫారీలపై ఘన విజయం సాధించిన కౌర్ సేన

వన్డే ట్రై సిరీస్‌లో భారత మహిళల జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ సిరీస్ లో మూడో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. బుధవారం (మే 7) సౌతాఫ్రికా మహిళలతో  జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో జెమీమా రోడ్రిగ్స్(101 బంతుల్లో 123: 15 ఫోర్లు, సిక్సర్) మెరుపు సెంచరీకి తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అలవోకంగా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులకు పరిమితమైంది. 

338 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. లారా గూడాల్ ను 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అమన్ జ్యోత్ కౌర్ ఔట్ చేసింది.  ఈ దశలో బ్రిట్స్, స్మిత్ రెండో వికెట్ కు 63 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా అన్నేరీ డెర్క్సెన్ (81), నోండుమిసో షాంగాసే(36) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. నాలుగో వికెట్ కు 70 పరుగులు జోడించిన తర్వాత నోండుమిసో షాంగాసే 36 పరుగులు చేసి పెవిలియన్ కు చేరింది. దీంతో సౌతాఫ్రికా ఛేజింగ్ లో వెనకపడింది. ఓ వైపు డెర్క్సెన్ ఒంటరి పోరాటం చేసి జట్టును నిలబెట్టింది. 

►ALSO READ | IPL 2025: RCBకి దెబ్బ మీద దెబ్బ.. కెప్టెన్‌తో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గాయాలు

ఇండియా విజయం ఖాయమన్న దశలో సఫారీ కెప్టెన్ చార్లీ ట్రయాన్ మెరుపులు మెరిపించి కౌర్ సేనను భయపెట్టింది. 43 బంతుల్లోనే 67 పరుగులు చేసి మ్యాచ్ చివరి వరకు పోరాడింది. అయితే కొట్టాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో విజయానికి 23 పరుగుల దూరంలో ఆగిపోయింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 337 పరుగుల భారీ స్కోర్ చేశారు. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. స్మృతి హాఫ్ సెంచరీ ఔటైన తర్వాత రోడ్రిగ్స్, దీప్తి శర్మ (93) సౌతాఫ్రికా బౌలర్లను దంచి కొట్టారు. ఐదో వికెట్ కు 122 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు.

మరిన్ని వార్తలు