
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న ఆ జట్టుకు స్టార్ ప్లేయర్ల గాయాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. పవర్ హిట్టర్ పిల్ సాల్ట్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. వీరిద్దరికి తోడు ఆ జట్టు కెప్టెన్ పటిదార్ చేతి వేలి గాయం ఆర్సీబీని మరింత కలవరానికి గురి చేస్తుంది.
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ వేలికి గాయం అయింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను తన చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. రవీంద్ర జడేజా కొట్టిన బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు పాటిదార్ గాయపడ్డాడు. 31 ఏళ్ల ఆర్సీబీ కెప్టెన్ శుక్రవారం (మే 9) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగబోయే మ్యాచ్ కు దూరం కానున్నట్టు సమాచారం. గాయం పెద్దది కాకపోవడంతో పటిదార్ మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండనుండడం ఆర్సీబికి ఊరటనిచ్చే విషయం.
►ALSO READ | Ayush Mhatre: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఆయుష్ మాత్రే.. సూర్య కెప్టెన్సీలో చెన్నై చిచ్చర పిడుగు
ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ లో శుక్రవారం (మే 9) లక్నో సూపర్ జెయింట్స్‌తో.. మే 13 న సన్ రైజర్స్ తో .. మే 17న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.