
భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధిస్తూ ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. దింతో Dream11, MPL, WinZO వంటి ప్రముఖ యాప్‌లు బ్యాన్ కానున్నాయి. వ్యసనం, మోసాలు ఇతర ప్రమాదాలను అరికట్టేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. సమాచారం ప్రకారం 2024–2025లో ఇండియాలో దాదాపు 15 నుండి 16 కోట్ల మంది ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారని, వీరిలో ఎక్కువ మంది డబ్బు పెట్టి లేదా బెట్టింగ్ చేస్తూ (real-money) గేమ్‌లు ఆడుతున్నట్లు తెలుస్తుంది.
రియల్-మనీ గేమింగ్ వల్ల ప్రజలకు హాని జరుగుతోందని ఇంకా మోసాలు, మనీలాండరింగ్ వంటి కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు ఈ గేమ్‌ల వల్ల ప్రజలు బానిసలవుతున్నారని, డబ్బులు పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యల కూడా జరుగుతున్నాయని చెప్పారు.
రియల్-మనీ గేమ్స్ vs సాధారణ గేమ్స్ మధ్య తేడా ఏంటి:
రియల్-మనీ గేమ్స్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశతో నిజంగా డబ్బు పెట్టి ఆడుతుంటారు. ఇందులో క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి చాల బెట్టింగ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో క్యాష్ డిపాజిట్, గిఫ్ట్ ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.
నాన్-రియల్-మనీ గేమ్: ఈ గేమ్స్ లో డబ్బు పెట్టి ఆడటం లేదా బీట్టింగ్ వేయడం ఉండదు. BGMI, క్యాండీ క్రష్, కాల్ ఆఫ్ డ్యూటీ, లూడో కింగ్ వంటి ఆటలు దీని కిందకి వస్తాయి. కొత్త చట్టం ఈ గేమ్స్ పై ప్రభావం చెయ్యదు.
ఆరోగ్యంపై ప్రభావం: ఆన్‌లైన్ గేమింగ్ మీ శరీరం, ఆలోచనలు రెండింటిపైనా సానుకూల, ప్రతికూల ప్రభావం చూపుతుంది. పరిశోధనల ప్రకారం వీడియో గేమ్‌లు ఆడటం వల్ల జ్ఞాపకశక్తి, శ్రద్ధ, సమస్యలకి పరిష్కార ఆలోచనలు పెరుగుతాయి. ఆన్ లైన్ గేమింగ్ ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
చెడు ప్రభావం : WHO ప్రకారం గేమింగ్ డిజార్డర్ అనేది మానసిక ఆరోగ్య సమస్య. దీని వల్ల మీ జీవితం, చదువు, ఉద్యోగం, మానవ సంబంధాలను ప్రభావం అవ్వొచ్చు. ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, వెన్ను, మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
ఇతర దేశాల్లో ఆన్‌లైన్ గేమింగ్ పై నిషేధం: చాల దేశాలు ఆన్‌లైన్ గేమింగ్‌ని నిషేధించాయి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లో ఆన్‌లైన్ జూదం(rummy) నిషేధించింది. చైనా, ఉత్తర కొరియా, కంబోడియా వంటి దేశాల్లో కూడా బ్యాన్ చేశాయి. జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి కొన్ని దేశాలు లైసెన్స్ ఉన్న సంస్థలను మాత్రమే గేమ్‌లను అనుమతిస్తాయి. అయితే బ్యాన్ చేసినా కూడా చాలా మంది VPNల ద్వారా గేమ్ ఆడుతున్నారు.
ఆన్‌లైన్ గేమింగ్ ఎంత పెద్దదంటే : WinZO, IEIC ప్రకారం, భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ రంగం 2029 నాటికి దాదాపు రూ. 76వేల కోట్లకి చేరుకుంటుందని అంచనా. ఇందులో ఎక్కువ భాగం రియల్-మనీ గేమింగ్ ద్వారానే వస్తుంది. 2024లో ఈ రంగం మూడు వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది, ఇందులో 86% రియల్-మనీ గేమ్‌ల వాటా ఉండగా, ఈ గేమింగ్ పరిశ్రమ 1.3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ఇంకా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
WinZO–IEIC రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో దాదాపు 1,900 గేమింగ్ కంపెనీలు ఉన్నాయి, వీటిలో సుమారు 1.3 లక్షల మంది పనిచేస్తున్నారు. రియల్-మనీ గేమ్‌లు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, మిగిలినవి సాధారణ గేమ్‌లు. రియల్-మనీ గేమింగ్ సైట్ WinZO గేమ్స్ అండ్ ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IEIC) ప్రకారం భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ రంగం 2029 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 76,వేల కోట్లకి చేరుకుంటుంది.