
నిజమండి. 2019 క్రికెట్ వరల్డ్ కప్ ను ఇండియా గెలిచేసింది. ఏంటి నమ్మరా? ‘ఇంకా ప్రాక్టీస్ మ్యాచ్ లే అయిపోలేదు. అప్పుడే కప్పు గెలవడమేంటి?’ అనుకుంటున్నారా? ఇది బీసీసీఐ తరఫున వరల్డ్ కప్ లో పాల్గొంటున్న ఇండియా టీమ్ గురించి కాదు. స్ర్టీట్ చైల్డ్ వరల్డ్ కప్ గురించి. లార్డ్స్ లో కప్ అందుకున్నరు స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2019ను ‘ఇండియా సౌత్’స్ట్రీట్ కిడ్స్ సాధించారు. కొద్ది రోజుల కిందట ఇంగ్లం డ్లో జరిగిన టోర్నీలో గెలిచారు. ‘మక్కా ఆఫ్ క్రికెట్’గా పేరు పొందిన లార్డ్స్ గ్రౌండ్ లో ట్రోఫీ అందుకున్నారు.
చెన్నైకి చెందిన వి.పౌల్ రాజ్ (కెప్టెన్), కె.సూర్యప్రకా-శ్, ఎ.నాగలక్ష్మి, బి.మొనీషా, ముంబైకి చెందిన వీధిబాలలు మణిరత్నం (వైస్ కెప్టెన్), భవానీ, ఇర్ఫాన్,షమ్మా ఈ టోర్నమెంట్ లో ఆడారు. వీరిలో కొందరినితల్లిదండ్రులు వదిలేశారు. కొందరి పేరెంట్స్ చనిపోయారు. మరికొందరు తమ తల్లిదండ్రులకు భారం కాకుండా చైల్డ్ లేబర్ గా పని చేసి సంపాదించుకున్నదాని తో క్రికెట్ ఆడారు. వీరందరికీ కరుణాలయ అనే షెల్టర్ హోమ్.. చేయూత అందించింది.
ఇలా ఆడుతారు
ప్రతి టీమ్ లో 8 మంది సభ్యులుంటారు .ఆరుగురు ఆడతారు. టీమ్ లో అమ్మాయిలు,అబ్బాయిల సంఖ్య సమానం. ఐదు ఓవర్లుంటాయి. ఓవర్ కు 4 బాల్స్ ఉంటాయి. వికెట్ కీపర్ మినహా మిగతా వారందరూ బౌలింగ్ చేయాలి.ఎవరైనా బాట్స్ మన్ లేదా బాట్స్ఉమన్ 15రన్స్ చేస్తే , వారు రిటైర్ అవ్వాలి. ఇంకో ప్లేయర్ అడేందుకు అవకాశం ఇవ్వాలి . ఈ ఫార్మాట్ ను‘స్ట్రీట్ 20 క్రికెట్’ అని పిలుస్తారు.