
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలో భారత్‌కు వ్యతిరేకంగా చైనా, తుర్కియే దేశాలు తమ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశాయి. దీనిపై భారత్ ఇప్పుడు చర్యలకు దిగింది. చైనా, తుర్కియే ప్రభుత్వ మీడియా సంస్థలకు అనుబంధంగా ఉన్న అనేక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లను బుధువారం బ్లాక్ చేసింది. తుర్కియే ప్రభుత్వ నిధులతో నడిచే అంతర్జాతీయ వార్తా సంస్థ టీఆర్టీ వరల్డ్..అలాగే, చైనా నియంత్రణలో ఉన్న ప్రముఖ వార్తా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువా అకౌంట్లు కూడా బ్లాక్ చేసిన లిస్టులో ఉన్నాయి.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై గ్లోబల్ టైమ్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేసింది. దాంతో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం.. గ్లోబల్ టైమ్స్‌ను బహిరంగగానే హెచ్చరించింది. వాస్తవాలను ధ్రువీకరించుకుని వార్తలు ఇవ్వాలని, ఆధారాలను మరోసారి క్రాస్ ఎగ్జామినేట్ చేయాలని సూచించింది. పాకిస్తాన్‌కు సానుభూతి చూపే ప్రయత్నంలో భాగంగా అనేక సోషల్ మీడియా ఖాతాలు ఆధారాలు లేని వాదనలను ప్రసారం చేస్తున్నాయని వివరించింది.
ఇక, అరుణాచల్ ప్రదేశ్‌పై సోషల్ మీడియా ద్వారా చైనా చేస్తున్న వాదనలను కూడా భారత్ ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. అక్కడి ప్రదేశాల పేర్లను మారస్తూ చైనా తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టింది. ఈ క్రమంలోనే ఈ దేశాల సోషల్ మీడియా అకౌంట్లను భారత్ బ్లాక్ చేసేసింది.