యూత్ టెస్ట్‎లో సత్తాచాటిన ఇండియా కుర్రాళ్లు.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో భారీ స్కోరు

యూత్ టెస్ట్‎లో సత్తాచాటిన ఇండియా కుర్రాళ్లు.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో భారీ స్కోరు

బెకెన్‌‌‌‌హామ్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌19 జట్టుతో తొలి యూత్ టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లు బ్యాటింగ్‌‌‌‌లో సత్తా  చాటారు. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో భారీ స్కోరు సాధించారు. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 450/7తో రెండో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్ 112.5  ఓవర్లలో 540 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) తొలి రోజే సెంచరీ కొట్టగా.. ఆర్ఎస్ అంబరీశ్ (70) ఫిఫ్టీతో సత్తా చాటాడు. 

ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్‌‌‌‌ గ్రీన్, రాల్ఫీ ఆల్బర్ట్‌‌‌‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌‌‌ రెండో రోజు చివరకు 60 ఓవర్లలో 230/5 స్కోరు చేసింది. రికీ ఫ్లింటాఫ్ (93), హమ్జా షేక్ (84) రాణించారు. ఇండియా బౌలర్లలో హెనిల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇండియా స్కోరుకు ఆతిథ్య జట్టు ఇంకా 310  రన్స్ దూరంలో ఉంది.