మిథాలీ మళ్లీ నం.1

V6 Velugu Posted on Jul 21, 2021

దుబాయ్‌‌‌‌ : ఇండియా కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌..ఐసీసీ విమెన్స్‌‌ వన్డే బ్యాట్స్‌‌విమెన్‌‌ ర్యాంకింగ్స్‌‌లో తిరిగి నంబర్‌‌వన్‌‌ స్థానానికి చేరింది. కెరీర్‌‌లో తొమ్మిదోసారి టాప్‌‌ ర్యాంక్‌‌ సాధించింది. మిథాలీ నుంచి గత వారం నంబర్‌‌ వన్‌‌ పొజిషన్‌‌ను దక్కించుకున్న వెస్టిండీస్‌‌ ప్లేయర్‌‌ స్టెఫానీ టేలర్‌‌ ఐదో ర్యాంక్‌‌కు పడిపోయింది. పాకిస్తాన్‌‌, విండీస్‌‌ మధ్య ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌లో తొలి మూడు మ్యాచ్‌‌లనే లేటెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌కు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మూడు వన్డేల్లో విఫలమైన టేలర్‌‌ 30 రేటింగ్‌‌ పాయింట్స్‌‌ కోల్పోయి ర్యాంకింగ్స్‌‌లోనూ దిగజారింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన లిస్ట్‌‌లో మిథాలీ ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో, టేలర్‌‌ ఐదో ప్లేస్‌‌లో నిలిచారు. ఇక, ఇండియా ఓపెనర్‌‌  స్మృతి మంధాన తొమ్మిదో ర్యాంక్‌‌ సాధించింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌‌లోఇండియానుంచి జులన్‌‌ గోస్వామి(5), పూనమ్‌‌ యాదవ్‌‌(9) మాత్రమే టాప్‌‌–10లో ఉన్నారు.

Tagged ICC, rankings, mithali raj, , Women\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'s ODI

Latest Videos

Subscribe Now

More News