WTC లో ఆరో ర్యాంక్ కు పడిపోయిన ఇండియా

WTC లో  ఆరో ర్యాంక్ కు పడిపోయిన ఇండియా

దుబాయ్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌ (48.15 పీసీటీ) ఆరో ర్యాంక్‌‌‌‌కు పడిపోయింది. 2025–27 సైకిల్‌‌‌‌లో ఇండియా ఆడిన 9 టెస్ట్‌‌‌‌ల్లో నాలుగింటిలో నెగ్గి, నాలుగింటిలో ఓడింది. ఒక మ్యాచ్‌‌‌‌ను డ్రా చేసుకుంది. 

ఇక సొంతగడ్డపై పాకిస్తాన్‌‌‌‌తో జరిగిన టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను 2–0తో క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌‌‌ (58.33) ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది చివర్లో శ్రీలంక, న్యూజిలాండ్‌‌‌‌ పర్యటనల్లో ఇండియా రెండేసి టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. ఆ తర్వాత 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మూడు సిరీస్‌‌‌‌ల్లో గెలిస్తే ర్యాంక్‌‌‌‌ మెరుగుపడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా (87.50), న్యూజిలాండ్‌‌‌‌ (77.78), సౌతాఫ్రికా(75.00), శ్రీలంక (66.67) వరుసగా టాప్‌‌‌‌–4లో ఉన్నాయి. ఇంగ్లండ్‌‌‌‌ (31.67), పాకిస్తాన్‌‌‌‌ (8.33), వెస్టిండీస్‌‌‌‌ (4.17) వరుసగా 7, 8, 9వ ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నాయి.