పేసరా.. స్పిన్నరా?:  నేటి నుంచి ఇండియా,  ఇంగ్లండ్‌‌ సెకండ్‌‌ టెస్ట్‌‌

పేసరా.. స్పిన్నరా?:  నేటి నుంచి ఇండియా,  ఇంగ్లండ్‌‌ సెకండ్‌‌ టెస్ట్‌‌
  • అశ్విన్‌‌, ఇషాంత్‌‌లో ఒకరికి చోటు
  •  మ. 3.30 నుంచి   సోనీ సిక్స్‌‌లో లైవ్‌‌

లండన్‌‌‌‌: వర్షం కారణంగా తొలి టెస్ట్‌‌‌‌లో విజయానికి దూరమైన టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌తో కీలకమైన సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు రెడీ అయ్యింది. గురువారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లో మరింత మెరుగైన బ్యాటింగ్‌‌‌‌ షో  చూపెట్టాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో.. బ్యాటింగ్‌‌‌‌తో పాటు బౌలింగ్‌‌‌‌నూ మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ ఇంజ్యూరీతో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌కు దూరం కావడంతో.. ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో మార్పు అనివార్యమైంది. అయితే ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌‌‌‌ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో.. ఇప్పుడు ఐదో బౌలర్‌‌‌‌గా  స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ను ఆడించాలా? లేక పేసర్లు  ఇషాంత్‌‌‌‌, ఉమేశ్​లో ఎవర్ని  తీసుకోవాలి? అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయితే లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ను పటిష్టం చేయాలనుకుంటే కచ్చితంగా అశ్విన్‌‌‌‌కే చోటు దక్కుతుంది. 2018 మాదిరిగా గ్రీన్‌‌‌‌ టాప్‌‌‌‌ వికెట్‌‌‌‌ ఉంటే మాత్రం ఇషాంత్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి వస్తాడు. ఏదైనా మ్యాచ్‌‌‌‌కు ముందు మాత్రమే దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్‌‌‌‌ ఉంది. మిగతా బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌‌‌‌ రాణిస్తుండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ కోహ్లీ, పుజారా, రహానె వైఫల్యం ఇబ్బందిగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా వీళ్లు గాడిలో పడతారని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆశిస్తోంది. ఓపెనింగ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌, రోహిత్‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఈ ఇద్దరు ఇచ్చే శుభారంభంపైనే ఇండియా భారీ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఓవరాల్‌‌‌‌గా బ్యాటింగ్ ​కంటే బౌలింగ్​పైనే ఎక్కువ ఫోకస్‌‌‌‌ పెట్టిన టీమిండియా.. గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్‌‌‌‌లో బరిలోకి దిగుతోంది. 


బ్రాడ్‌‌‌‌ ఔట్‌‌‌‌.. అండర్సన్‌‌‌‌ డౌట్‌‌‌‌..

ఈ మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌కు అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. కాలిపిక్క గాయం వల్ల   స్టువర్ట్ ​బ్రాడ్‌‌‌‌ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొడ  ఇంజ్యూరీతో బాధపడుతున్న అండర్సన్‌‌‌‌ సెకండ్​ టెస్ట్​ ఆడటం అనుమానంగా మారింది. 2016 తర్వాత ఈ ఇద్దరు ఒకేసారి మ్యాచ్‌‌‌‌కు దూరం కావడం ఇది ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌. బ్రాడ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో లాంక్‌‌‌‌షైర్‌‌‌‌ సీమర్‌‌‌‌ సాకీబ్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ అరంగేట్రం చేసే చాన్స్‌‌‌‌ ఉంది. పిచ్‌‌‌‌ స్పిన్‌‌‌‌కు అనుకూలిస్తే ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ మొయిన్‌‌‌‌ అలీ తుది జట్టులోకి రావొచ్చు. బ్యాటింగ్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూ జనరేషన్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ప్లేయర్లలో పెద్దగా క్వాలిటీ లేదు. అందుకే బుమ్రా, షమీ బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కోవడంలో వీళ్లు తడబడుతున్నారు. దీనికి పరిష్కారం కనిపెట్టాలి. కెప్టెన్‌‌‌‌ జో రూట్‌‌‌‌ మినహా.. బర్న్స్‌‌‌‌, సిబ్లే, బెయిర్‌‌‌‌స్టో, వికెట్​ కీపర్​ బట్లర్​ ఫామ్‌‌‌‌లోకి రావడం అత్యవసరం. మిడిలార్డర్‌‌‌‌లో మార్పులు అనివార్యమైతే కొత్త కుర్రాడు హసీబ్‌‌‌‌ హమీద్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ దక్కొచ్చు. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో వర్షం వల్ల ఓటమిని తప్పించుకున్న ఇంగ్లండ్‌‌‌‌కు ఆతిథ్య అనుకూలత ఉన్నా.. టీమిండియా పేస్‌‌‌‌–స్పిన్‌‌‌‌ను ఎదుర్కొని నిలుస్తారా? చూడాలి.

జట్ల అంచనా

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌‌‌), రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, పుజారా, రహానె, పంత్‌‌‌‌, జడేజా, అశ్విన్‌‌‌‌ / ఇషాంత్‌‌‌‌, షమీ, బుమ్రా, సిరాజ్‌‌‌‌.
ఇంగ్లండ్‌‌‌‌: రూట్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), బర్న్స్‌‌‌‌, సిబ్లే, క్రాలీ / హసీబ్‌‌‌‌ హమీద్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, బట్లర్‌‌‌‌, అలీ, కరన్‌‌‌‌, రాబిన్సన్‌‌‌‌, వుడ్‌‌‌‌, ఓవర్టన్‌‌‌‌ / సాకీబ్‌‌‌‌ మహ్మద్‌‌‌‌. 
పిచ్‌‌‌‌, వాతావరణం
గ్రీన్‌‌‌‌ టాప్‌‌‌‌ వికెట్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ ఉంది. ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు ఇబ్బందే. వర్షం ముప్పు లేదు.