నేను అదే నమ్ముతున్నా.. కానీ ప్రూఫ్స్ మాత్రం లేవు: బైడెన్

నేను అదే నమ్ముతున్నా..  కానీ ప్రూఫ్స్ మాత్రం లేవు: బైడెన్

వాషింగ్టన్: ఇటీవల జీ20 సమిట్ సందర్భంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు ప్రకటన చేయడమే.. ఇజ్రాయెల్​పై హమాస్ దాడికి కారణమై ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారిడార్ తో రైల్వే, రోడ్, పోర్ట్స్ కనెక్టివిటీ జరుగుతుందన్నారు. ఇజ్రాయెల్​పై హమాస్ టెర్రరిస్ట్​లు జరిపిన దాడులకు ఈ ఎంవోయూ కూడా ఒక కారణమని నమ్ముతున్నట్లు బైడెన్ వివరించారు. 

అయితే.. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రం తన వద్ద లేవన్నారు. ఇది ఇజ్రాయెల్​తో పాటు ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన కారిడార్ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ కారిడార్‌ విషయంలో వెనక్కి తగ్గబోమని బైడెన్‌ స్పష్టం చేశారు.