ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌పై బ్యాన్‌ పొడిగింపు

ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌పై బ్యాన్‌ పొడిగింపు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసెంజర్ ఫ్లయిట్స్‌పై బ్యాన్‌ను కేంద్రం పొడిగించింది. వచ్చే నెల 31 వరకు ఫ్లయిట్స్‌పై నిషేధం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిబంధనలు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రూవ్ చేసిన ఇంటర్నేషనల్ కార్గో ఆపరేషన్స్‌కు వర్తించబోవని స్పష్టం చేసింది.

ఇండియాకు వచ్చే, వెళ్లే షెడ్యూల్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసెంజర్ సర్వీసెస్‌పై ఆగస్టు 31 వరకు సస్పెన్షన్‌ను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించాం అని ఓ ప్రకటనలో కేంద్ర సర్కార్ తెలిపింది. ఈ నెలారంభంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌పై జూలై 31 వరకు కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుతం పరిస్థితిలో పెద్దగా మార్పు లేవడంతో ఆ బ్యాన్‌ను మరో నెల రోజులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.