కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. సఫారీ బౌలర్ల ధాటికి మన బ్యాటర్లు
పెవిలియన్ కు క్యూ కట్టారు. శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో బ్యాటింగ్ లో చేతులెత్తేయడంతో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు కేవలం 30 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. 39 పరుగులు చేసిన రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుందర్ (29), పంత్ (27), జడేజా (27) వచ్చిన మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు.. జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. హార్మర్,కార్బిన్ బాష్ లకు చెరో వికెట్ దక్కింది.
నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులతో రెండో సెషన్ పప్రారంభించిన టీమిండియా క్రమం తప్పకుండ వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఆరంభంలోనే ఫామ్ లో ఉన్న జురెల్ (14).. హార్మర్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఉన్నంత వరకు ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన జడేజాను 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్మర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివరి వికెట్ రూపంలో అక్షర్ ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 200 పరుగులు చేరకుండానే ముగిసింది. గాయం కారణంగా గిల్ బ్యాటింగ్ కు రాలేదు.
వికెట్ నష్టానికి 37 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. తొలి సెషన్ లో 101 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. సుందర్, రాహుల్ ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. క్రీజ్ లో కుదురుకున్న తర్వాత వీరిద్దరూ వేగం పెంచారు. దీంతో భారత్ స్కోర్ వేగంగా వెళ్ళింది. రెండో వికెట్ కు 57 పరుగులు జోడించిన తర్వాత క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడీని సఫారీ స్పిన్నర్ హార్మర్ విడగొట్టాడు. ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో సుందర్ (29)ను బోల్తా కొట్టించడంతో ఇండియా 75 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
తొలి రోజు నిదానంగా ఆడిన రాహుల్ రెండో రోజు వేగంగా ఆడాడు. కొన్ని బౌండరీలతో మంచి టచ్ లో కనిపించిన కేఎల్.. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బంతిని కొందకి ఆడాలని చూసిన రాహుల్.. స్లిప్ లో మార్కరం కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ రిటైర్డ్ హర్ట్ తో క్రీజ్ లోకి వచ్చిన పంత్ ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన పంత్ 24 బంతుల్లోనే 2ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి లంచ్ కు ముందు పెవిలియన్ చేరాడు. పంత్ వికెట్ సఫారీలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, మహరాజ్, హార్మర్,కార్బిన్ బాష్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైంది.
South Africa’s disciplined bowling limits India to a 30-run lead!
— Star Sports (@StarSportsIndia) November 15, 2025
Will India’s bowlers now exploit the conditions and pin down the defending WTC champions in the 2nd innings? 👀#INDvSA | 1st Test, Day 2, LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/vQjVn6f0Cs
