ముగిసిన ఆరో విడత లోక్ సభ పోలింగ్‌

ముగిసిన ఆరో విడత  లోక్ సభ  పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా  ముగిసింది.  6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది.  సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఓటింగ్ శాతం 57.7%గా నమోదైంది. బీహార్ 52.24%, హర్యానా 55.93% , జమ్మూకాశ్మీర్ 51.35%, జార్ఖండ్ 61.41%,  ఒడిశాలో 59.6%, ఢిల్లీలో 53.73%, ఉత్తరప్రదేశ్ 52.02 శాతం పోలింగ్  నమోదైంది.  

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఆరో దశ పోలింగ్ జరుగింది. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు, ఒడిశాలో 6, జార్ఖండ్‌లోని 4 స్థానాలలో  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత మనోజ్ తివారీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాహుల్  గాంధీ కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.