సెయింట్ లూయిస్ (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. సింక్ ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో బోణీ చేశాడు. సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో ప్రజ్ఞా36 ఎత్తుల వద్ద వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌కు చెక్ పెట్టాడు. దాంతో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. నల్లపావులతో క్వీన్ గాంబిట్ స్ట్రాటజీతో ఆడిన గుకేశ్‌ను ప్రజ్ఞా ఈజీగా ఎదుర్కొన్నాడు.
మరో గేమ్‌లో లెవోన్ అరోనియన్ (అమెరికా).. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఫ్యాబియానో కరువాన (అమెరికా)–. డుడా జాన్ క్రిస్టోఫ్ (పోలెండ్), శామ్యూల్ సావియన్ (అమెరికా)– వెస్లీ సో (అమెరికా), మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)– అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్) గేమ్‌లు డ్రా అయ్యాయి. తొలి రౌండ్ తర్వాత ప్రజ్ఞా, ఆరోనియన్ చెరో పాయింట్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
