రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించారు. భారత్ ఓ అద్భుత మేధావిని కోల్పోయిందని తన మెసేజ్ లో తెలిపారు..ఇదే విషయంపై ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీలకు తన మెసేజ్ పంపారు. రాష్ట్రపతిగా ఇతర బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ స్వదేశంతోపాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు. నిజమైన స్నేహితుడిగా రష్యా,భారత్ నడుమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఎంతగానో కృషి చేశారన్నారు పుతిన్.
