మహిళల టీ20 ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో భారత్‌‌‌‌‌‌‌‌దే పైచేయి: మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా

మహిళల టీ20 ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో భారత్‌‌‌‌‌‌‌‌దే పైచేయి: మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా

అహ్మదాబాద్: రాబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో భారత జట్టు ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతుందని మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా పేర్కొన్నారు. జూన్ 14న పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు భారత క్రీడాకారిణులకు కొత్తవేమీ కాదన్నారు. 

గాయం తర్వాత పునరాగమనం చేసిన యాస్తికా భాటియా రాణించడం జట్టుకు సానుకూల అంశమని, అవసరాన్ని బట్టి బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు జట్టుకు ఉండాలని ఆమె సూచించారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లు ఒకే గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నందున సెమీస్ చేరడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.

రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌కు పిలుపు ఖాయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిపిన రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌కు భారత టీ20 జట్టులో ఖచ్చితంగా చోటు దక్కుతుందని చోప్రా ధీమా వ్యక్తం చేశారు. పటీదార్‌‌‌‌‌‌‌‌ నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ కలిగిన ఆటగాడని కొనియాడారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మైదానం వెలుపల వచ్చే పాపులారిటీని, అభిమానుల ఆదరణను తట్టుకుని నిలబడడమే ఇప్పుడు అతిపెద్ద పరీక్ష అని చోప్రా వివరించారు.