ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సొంతగడ్డ కావడం.. సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సౌతాఫ్రికా భారీ ఓటమి నుంచి త్వరగా బయటకు వచ్చి టీమిండియాను ఓడించాలనే ఆలోచనలో ఉంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే భారత జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు సౌతాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. రీజా హెన్డ్రిక్స్, బార్ట్ మన్, లిండే తుది జట్టులోకి వచ్చారు.
ఓపెనర్లుగా అభిషేక్‌శర్మ, సంజూ శాంసన్‌రాణించినప్పటికీ.. గిల్‌పై నమ్మకంతో ఓపెనింగ్ స్లాట్‌కేటాయించారు. దాంతో శాంసన్‌కు తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. ఫైనల్ఎలెవన్లోకి రావడానికి శాంసన్‌ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత టీ20 వరల్డ్ కప్‌ముందు వరకు కోహ్లీ ప్లేస్‌కు సరిగ్గా సరిపోయిన గిల్‌ఇప్పుడు మాత్రం గాడి తప్పడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. పవర్‌ప్లేలో అభిషేక్‌మాదిరి దూకుడుగా ఆడటంలో గిల్‌విఫలమవుతున్నాడు. కెప్టెన్‌సూర్యకుమార్‌యాదవ్‌కూడా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు.
రాబోయే మెగా టోర్నీలో కెప్టెన్‌గా కొనసాగాలంటే సూర్య కచ్చితంగా బ్యాట్‌ఝుళిపించాల్సిందే. తిలక్ వర్మ, అక్షర్‌పటేల్, హార్దిక్‌పాండ్యా మిడిలార్డర్ భారం మోయనున్నారు. గాయం నుంచి తిరిగి వచ్చిన ఆల్‌రౌండర్‌పాండ్యా మునుపటి స్థాయిలో ఆడుతుండటం అదనపు బలంగా మారింది. బ్యాట్, బాల్‌తో స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాడు. శివమ్‌దూబే, జితేష్‌శర్మ ఫినిషింగ్‌పై దృష్టి సారించాలి.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ డే, మార్కో జాన్సెన్, లుథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్

