ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20లో భాగంగా ఇప్పటికే రెండు ముగిశాయి. తొలి మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నేడు జరగనున్న టీ20లో రెండు జట్లు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రానా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో మూడు మార్పులు చేసింది.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
