చైనాతో సంబంధం ఉన్న యాప్స్ పై నిషేధం

 చైనాతో సంబంధం ఉన్న యాప్స్ పై  నిషేధం

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే హానికర యాప్ లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చైనాతో సంబంధం ఉన్న138 బెట్టింగ్​ యాప్​లు, 94 లోన్ లెండింగ్ యాప్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ వారంలో ఈ యాప్స్ ను బ్యాన్ చేయనున్నట్టు కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోన్ యాప్స్ వల్ల చాలా మంది సామాన్యులు వేధింపులకు గురవుతున్నారు. సమస్యలతో సతమవుతున్న వారు ఎక్కువగా ఈ రుణ యాప్ లుకు ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి, వారి సన్నిహితులకు పంపిస్తామని అసభ్యకరమైన మెసేజ్ లను పెడతారు.

అయితే ఇలాంటి సంఘటనలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రా్ల్లో ఎక్కువగా జరగడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలపై స్పందించిన కేంద్రం హోంశాఖ గత ఆర్నెళ్ల క్రితం నుంచే  చైనీస్ లోన్ లెండింగ్ యాప్ లపై దృష్టి సారించింది. అందులో భాగంగానే తాజాగా 94 యాప్ ల నిషేధంపై నిర్ణయం తీసుకుంది. మరికొన్ని యాప్స్ థర్డ్ పార్టీ లింక్ ల ద్వారా పనిచేస్తున్నాయని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రస్తుతం చాలా యాప్ లు అందుబాటులో ఉండడం లేదు. చాలా వరకు బెట్టింగ్ యాప్ లు, గేమ్ లు లింకులు లేదా వెబ్ సైట్ల ద్వారానే డౌన్ లోడ్ అవుతుండడంతో హానికర యాప్ లను గుర్తించడం కష్టతరంగా మారింది.