ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానంలో భారత్​

ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానంలో భారత్​

గత ఐదేళ్లలో 2019 నుంచి 2023 వరకు భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు చేసింది. గత ఐదేళ్లలో భారతదేశ ఆయుధాల కొనుగోళ్లు 4.7 శాతం పెరిగాయని స్టాక్​ హోమ్​ ఇంటర్నేషనల్​ పీస్​ రెసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ స్వీడన్​ (ఎస్​ఐపీఆర్​ఐ) నివేదిక వెల్లడించింది. 

  •     భారతదేశానికి ప్రధాన ఆయుధ సరఫరాదారులుగా తొలి మూడు దేశాలు రష్యా (36 శాతం), ఫ్రాన్స్​ (33 శాతం), అమెరికా (13 శాతం) ఆయుధాలను విక్రయించారు. పాకిస్తాన్​కు చైనా గరిష్టంగా 66 శాతం ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆయుధాల దిగుమతిని 43 శాతం పెంచింది.
  •     2019–23 మధ్యలో ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో పాకిస్తాన్​ ఐదో స్థానంలో ఉంది. అయితే, చైనా ఆయుధ దిగుమతుల్లో 44 శాతం క్షీణత నమోదైంది. చైనా రెండు తూర్పు ఆసియా పొరుగు దేశాలైన జపాన్​; దక్షిణకొరియా ఆయుధాల కొనుగోళ్లపై తమ వ్యయాన్ని పెంచాయి. జపాన్​లో 155 శాతం, దక్షిణకొరియాలో 6.5 శాతం పెరుగుదల కనిపించింది. 
  •     భారత్​కు రష్యా అత్యధికంగా 36 శాతం ఆయుధాలను సరఫరా చేస్తున్నా ఆయుధాల ఎగుమతుల్లో రష్యా మూడో స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2014–18, 2019–23లో యూరప్​ ఆయుధాల దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీని వెనుక రెండేళ్లుగా సాగుతున్న రష్యా – ఉక్రెయిన్​ యుద్ధం కారణం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు సైనిక సహాయంగా ఉక్రెయిన్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి.