వచ్చే నెల నుంచి అందుబాటులోకి స్పుత్నిక్ వీ!

వచ్చే నెల నుంచి అందుబాటులోకి స్పుత్నిక్ వీ!

న్యూఢిల్లీ: రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌‌కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీకా ఎప్పుడు భారత్‌‌లో అందుబాటులోకి వస్తుందనే విషయం పైనా క్లారిటీ వచ్చింది. వచ్చే నెల నుంచి స్పుత్నిక్ వీ రష్యా నుంచి మన దేశానికి దిగుమతి కానుందని విశ్వసనీయ సమాచారం. జూన్ లేదా జూలై నుంచి భారత్‌లో స్థానికంగా స్పుత్నిక్ ఉత్పత్తి మొదలవుతుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వీని దేశీయంగా పంపిణీ చేయనుంది. స్పుత్నిక్ వీ క్లినికల్ ట్రయల్స్‌‌ను స్థానికంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్వహించింది.