ఇండియా మెడ్ ఎక్స్పో షురూ

ఇండియా మెడ్ ఎక్స్పో షురూ

హైదరాబాద్​, వెలుగు: ఇండియా మెడ్​ ఎక్స్​పో 2025 హైదరాబాద్​లో శుక్రవారం మొదలైంది.  డిసెంబర్ 5, 6, 7 తేదీలలో హైటెక్స్​ ఎగ్జిబిషన్ సెంటర్​లో కార్యక్రమం జరుగుతోంది. ఈ ఎక్స్​పోలో అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్​, సర్జరీ సొల్యూషన్స్​, హాస్పిటల్ ​టెక్నాలజీలను చూపించే 400కుపైగా స్టాల్స్​ ఉన్నాయి.

 ఈ ఏడాది ఎడిషన్​ అతిపెద్దది అవుతుందని నిర్వాహకులు తెలిపారు.  డాక్టర్లకు, ఆసుపత్రులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి, వైద్య ఆవిష్కరణలను అందరికీ అందించడానికి ఇండియా మెడ్ ఎక్స్​పో చాలా కీలకమని ఐఎంఏ ప్రతినిధి అన్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యార్థులు సహా అందరూ ఈ ఎక్స్​పోను ఉచితంగా చూడవచ్చు.