2038 Asian Games: ప్రపంచ క్రీడా రంగంలో తన ముద్ర వేసేందుకు భారతదేశం మరో భారీ అడుగు వేసింది. 2038 ఆసియా క్రీడలకు (Asian Games) ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధికారికంగా తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ ప్రతిపాదనలు (EOI) సమర్పించింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మరింత పెంచాలని ఇండియా భావిస్తోంది. ఏప్రిల్ 21న చైనాలోని సాన్యా నగరంలో ఇటీవల జరిగిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) సమావేశంలో భారత్ పంపిన ఈ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని IOA సీఈఓ రఘురామ్ అయ్యర్ ధృవీకరించారు. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌కే ఛాన్స్?:
వరుస మెగా ఈవెంట్లకు వేదికగా మారుతున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, 2038 ఆసియా క్రీడల రేసులో కూడా ముందు వరుసగా నిలిచింది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం అహ్మదాబాద్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆసియా క్రీడలు కూడా అక్కడే నిర్వహించే అవకాశం ఉంది.
పోటీలో ఉన్న ఇతర దేశాలు:
ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం భారత్‌తో పాటు దక్షిణ కొరియా, మంగోలియా లాంటి దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. 2038లో ఈ క్రీడలు ఎక్కడ జరుగుతాయనేది 2028 సంవత్సరంలో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది.
భారత్ చరిత్ర ఇదే:
భారత్ గతంలో రెండుసార్లు ఆసియా క్రీడలని విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది
* 1951: తొలి ఆసియా క్రీడలు (న్యూఢిల్లీ)
* 1982: తొమ్మిదవ ఆసియా క్రీడలు (న్యూఢిల్లీ)..
* ఒకవేళ 2038లో భారత్ ఈ అవకాశం దక్కించుకుంటే, దాదాపు 56 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడలు మళ్ళీ భారత గడ్డపై జరుగుతాయి.
ఆసియా క్రీడల ప్రాముఖ్యత:
ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఆసియా క్రీడలకు గుర్తింపు ఉంది. 45 దేశాల నుంచి సుమారు 11,000 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. గత ఏడాది చైనాలో జరిగిన క్రీడల్లో 40 విభాగాల్లో పోటీలు జరగడం విశేషం. వరుసగా కామన్వెల్త్, ఒలింపిక్స్, ఆసియా క్రీడలపై దృష్టి సారించడం ద్వారా భారత్ ప్రపంచ క్రీడా పటంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ALSO READ : RCB vs GT మధ్య హై-స్కోరింగ్ మ్యాచ్..
Budgam, J&K: Union Minister Mansukh L. Mandaviya says, "The country has won the bid to host the Commonwealth Games in 2030, and India had also submitted a bid for the Olympic Games in 2036. All procedures are in place to meet the requirements of the International Olympic… pic.twitter.com/e8v3SYTbmj
— IANS (@ians_india) April 24, 2026

