గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ఓటమి అంచుల్లో నిలిచింది. 549 పరుల భారీ ఛేజింగ్ లో నాలుగో రోజు అట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్ లో సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే చివరి రోజు 522 పరుగులు చేయాలి. మరో వైపు ఇంగ్లాండ్ విజయానికి 8 వికెట్లు అవసరం. ఈ టెస్టులో టీమిండియా తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డుకు చేరువలో ఉంది. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టెస్ట్ క్రికెట్ లో భారత జట్టు అతి పెద్ద ఓటమికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా అతి పెద్ద ఓటమి 342 పరుగులతో ఓడిపోవడం. 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా విధించిన 543 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్నపుడు ఇండియా 200 పరుగులకే ఆలౌటైంది. దీంతో 342 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. గౌహతి టెస్టులో ఐదో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. సౌతాఫ్రికా 549 పరుగుల టార్గెట్ సెట్ చేసింది.
ప్రస్తుతం ఇండియా 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. చివరి రోజు ఇండియా 205 పరుగులకు ఆలౌట్ అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఓటమిని మూట కట్టుకుంటుంది. ఈ సిరీస్ లో ఇండియా బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఒక్క ఇన్నింగ్స్ లో కూడా కనీసం 220 పరుగులను దాటలేదు. మరి సఫారీ బౌలర్లను తట్టుకొని చిత్తుగా ఓడకుండా మ్యాచ్ ను డ్రా చేసుకుంటారా లేకపోతే చేతులెత్తేస్తారో చూడాలి.
టెస్ట్ క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద ఓటములు
2004లో ఆస్ట్రేలియాపై 342 పరుగులు
2006లో పాకిస్థాన్‌పై 341 పరుగులు
2007లో ఆస్ట్రేలియాపై 337 పరుగులు
2017లో ఆస్ట్రేలియాపై 333 పరుగులు
1996లో దక్షిణాఫ్రికాపై 329 పరుగులు
549 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ తమ పేలవ ఫామ్ కొనసాగించారు. ఆరంభంలో జైశ్వాల్ ఫోర్, సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించినా జాన్సెన్ బ్రేక్ లు వేశాడు. ఒక సూపర్ డెలివరీతో 13 పరుగుల వద్ద జైశ్వాల్ ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే స్పిన్నర్ హార్మర్..భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. సాయి సుదర్శన్, కుల్దీప్ మరో వికెట్ పడకుండా నాలుగో రోజును ముగించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇండియా 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులకు డిక్లేర్ చేసింది.
