ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం ఖాయమనుకుంటే ఒత్తిడిలో కనిపిస్తుంది. 124 పరుగుల ఈజీ టార్గెట్ ను ఛేజ్ చేయడానికి బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 10 మందితోనే ఆడుతోంది. గాయం కారణంగా కెప్టెన్ శుభమాన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడానికి రావడం లేదు. మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. గిల్ లేకపోవడంతో భారత్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినట్టే.
124 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0) వికెట్ కోల్పోయింది. నాలుగో బంతికి మార్కో జాన్సెన్ ఒక సూపర్ డెలివరీతో టీమిండియా ఓపెనర్ ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జాన్సెన్ మరోసారి టీమిండియాకు షాక్ ఇచ్చాడు. ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో రాహుల్ (1)ను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఇండియా ఒక పరుగుకే ఓపెనర్లను చేజార్చుకుంది. పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా మారుతోంది. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. దీంతో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. మూడో రోజు లంచ్ తర్వాత టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.
ప్రస్తుతం క్రీజ్ లో ధృవ్ జురెల్ (4), వాషింగ్ టన్ సుందర్ (5) ఉన్నారు. టీమిండియా విజయానికి మరో 114 పరుగులు కావాలి. మరోవైపు 7 వికెట్లు తీస్తే సౌతాఫ్రికా గెలుస్తుంది. పంత్, జడేజా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఈజీ అనుకున్న మ్యాచ్ ను మన జట్టు టెన్షన్ కు తెచ్చుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో మూడో రోజు అట ప్రారంభించిన సౌతాఫ్రికా బవుమా పోరాటంతో 60 పరుగులు జోడించి 153 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులు చేస్తే.. ఇండియా 189 పరుగులకే ఆలౌట్ అయింది.
