IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తుంది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీలను తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసి స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి టీమిండియా బరిలోకి దిగింది. 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో ఆదివారం (నవంబర్ 16)  రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి మూడు వికెట్లను సౌతాఫ్రికా 60 పరుగుల తేడాలో కోల్పోయింది. దీంతో టీమిండియా ముందు సఫారీలు కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు.  ఇండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకోగా బుమ్రా, అక్షర్ పటేల్ కు తలో వికెట్ దక్కింది.  

రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో మూడో రోజు అట ప్రారంభించిన సౌతాఫ్రికా బవుమా పోరాటంతో 60 పరుగులు జోడించింది. ప్రారంభంలో బవుమా తో కలిసి కార్బిన్ బాష్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. తొలి గంట వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బవుమా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 8వ వికెట్ కు 41 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. కార్బిన్ బాష్ ను బౌల్డ్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. కాసేపటికి సిరాజ్ బౌలింగ్ కు వచ్చి చివరి రెండు వికెట్లను ఒకే ఓవర్లో తీసుకోవడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. 

శనివారం (నవంబర్ 15) ఒక్క రోజే ఏకంగా 16 వికెట్లు కూలడంతో మ్యాచ్ మూడో రోజే ఫలితం రానుంది. మొదట సౌతాఫ్రికా రెచ్చిపోయి టీమిండియాను 189 పరుగులకు ఆలౌట్ చేస్తే.. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు అంతకుమించి అన్నట్టుగా సౌతాఫ్రికాను 153 పరుగులకే ఆలౌట్ చేశారు. శనివారం ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 37/1తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 189 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆలౌటైంది.