వాళ్లను కలవడం సిగ్గుచేటు..మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ పరివారం

వాళ్లను కలవడం సిగ్గుచేటు..మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ పరివారం

భారత్ పై అమెరికా మరోసారి అక్కసు వెల్లగక్కింది.. చైనా, రష్యాలతో భారత్ దోస్తీని తట్టుకోలేక తీవ్ర విమర్శలు చేసింది. ఆరెండు దేశాలతో భారత్ చేతులు కలపడం సిగ్గుచేటు.. నియంతృత్వ దేశాలు అయిన రష్యా, చైనాతో దోస్తీ ఇండియాకే నష్టం.. అంటూ నీతులు చెప్పుకొచ్చింది. 

సోమవారం (సెప్టెంబర1) చైనాలోని టియాంజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) సమ్మిట్ లో చైనా అధ్యక్షుడు జిన పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ స్నేహపూర్వకంగా ఉండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయకుడు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేసి మరోసారి వారి అక్కసును వెల్లగక్కారు. 

మోదీ, జిన్ పింగ్, పుతిన్ ముగ్గురు నేతల మధ్య స్నేహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రంప్ సుంకాల సలహాదారు పీటర్ నవారో స్పందిస్తూ.. ప్రపంచంలోనే ఇద్దరు అతిపెద్ద  నియంతృత్వ నేతలతో మోదీ స్నేహం చేయడం సిగ్గుచేట్టు అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ  రష్యాతో కాకుండా అమెరికా, యూరప్, ఉక్రెయిన్ తో ఉండాలని కోరుకుంటుందని నవారో అన్నారు. 

నవారో ఇంతకుముందు కూడా భారత్ పై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో హైలైట్ అయ్యారు. భారత్ ను సుంకాల మహారాజు అంటూ రష్యా లాండ్రోమాట్, ఉక్రెయిన్ సంఘర్షణను మోదీ యుద్దం అని  విమర్శించారు. ఆదివారం చేసి తాజా ప్రకటనలో బ్రహ్మణులు భారత ప్రజలను పణంగా పెట్టి లాభం పొందుతున్నారని  ఆరోపించారు.