శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్

శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్

కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తుండటంతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్నాటకలో 5 కొత్త కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 158కు చేరింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఢిల్లీతో పాటు 10 రాష్ట్రాలు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్ లో 17, గుజరాత్ లో  11, బెంగాల్ లో 4, ఏపీ, చండీగఢ్, తమిళనాడుల్లో ఒక్కో కేసు చొప్పున వెలుగులోకి వచ్చాయి. 

ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా వేరియెంట్ కన్నా ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పింది. ఇప్పటికే 90కి పైగా దేశాల్లో ఈ వేరియెంట్ ప్రభావం చూపుతోందని వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. 

For more news

గాంధీలో ఒమిక్రాన్ అనుమానితుడు

UK Omicron cases: ఒకేసారి పదివేల ఒమిక్రాన్ కేసులు