V6 News

బార్డర్​లో టెన్షన్.. చిక్కుల్లో చైనా బిజినెస్

బార్డర్​లో టెన్షన్.. చిక్కుల్లో చైనా బిజినెస్

తూర్పు లడఖ్‌‌‌‌లోని గల్వాన్‌‌‌‌ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన యుద్ధంతో దేశంలో యాంటీ చైనా  బాగా ట్రెండవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంతో చైనాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారతీయుల్లో, ఈ యుద్ధం మరింత సెగను చెలరేగించింది. ఇండియాలో వ్యాపారాలు నిర్వహిస్తోన్న అలీబాగా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ నుంచి షావోమి లిమిటెడ్ వరకు ఉన్న కంపెనీలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఎకానమీలకు మధ్య చాలా ట్రేడ్ జరుగుతోంది. చాలా చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాయి. ఇండియన్ కంపెనీలు చైనా సప్లయి చెయిన్‌‌‌‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం చెలరేగిన వివాదంతో చైనా నుంచి దిగుమతి చేసుకున్న పార్ట్ ‌‌‌లపై   ప్రత్యామ్నాయాలను చూస్తున్నట్టు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్ అనీష్ శ్రీవాస్తవ తెలిపారు. వైట్ గూడ్స్, లగేజ్ బ్యాగ్స్, ఆటో కాంపోనెంట్లు, కొన్ని ఈకామర్స్ కంపెనీలు వారి బిజినెస్ స్ట్రాటజీని మార్చుకోవడంపై పనిచేస్తున్నట్టు చెప్పాయి.

ఇప్పటికే కరోనా వైరస్ అవుట్‌‌‌‌బ్రేక్‌‌‌‌తో చైనా రామెటీరియల్స్‌‌‌‌పై ఆధారపడ్డ ఇండియన్ బిజినెస్‌‌‌‌లు బాగా దెబ్బతిన్నాయి. ఇండియాలో లాక్‌‌‌‌డౌన్ కంటే ముందే, చైనా రామెటీరియల్‌‌‌‌పై ఆధారపడ్డ కంపెనీలు మూతపడ్డాయి. గ్లోబల్‌‌‌‌గా సప్లయి చెయిన్‌‌‌‌ లో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు చెలరేగిన ఈ వివాదంతో ఇండియన్ ఎకానమీ రికవరీ అవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్లు ఇప్పటికే చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ చైనా నినాదం బాగా ట్రెండవుతోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఎకనమిక్ అవకాశాలను ఇండియా వెతుకుతోంది.

ముందటి వివాదాలతో పోలిస్తే ఇప్పడి వివాదం చాలా చిన్నదని షాంఘైకు చెందిన హెంగ్‌‌‌‌సెంగ్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ కో ఫండ్ మేనేజర్ దాయ్ మింగ్ చెప్పారు. ఈ టెన్షన్స్ ఇండియాలోని చైనా సంస్థల పెట్టుబడులు, వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియా, చైనాలు ఇరు దేశ సంస్థలకు కీలక మార్కెట్లుగా ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఈ రెండు దేశాల్లో తమ ఫుట్‌‌‌‌ప్రింట్‌‌‌‌ను విస్తరించాలనుకుంటున్నాయి.. కానీ ఈ సమయంలో ఇరు దేశాల మధ్య 40 ఏళ్లలో తొలిసారి సరిహద్దులో మళ్లీ వివాదం నెలకొంది.

ఇండియాలో చైనా బిజినెస్‌‌‌‌లు…

అలీబాబాకు ఇండియాలో డేటా సెంటర్లున్నాయి. దాని ‘యూసీ బ్రౌజర్’కి ఇండియాలో పేజ్ వ్యూస్ ప్రకారం పాపులర్ మొబైల్ బ్రౌజర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. షావోమి కంపెనీ ఇండియాలో టాప్ స్మార్ట్‌‌‌ ఫోన్ బ్రాండ్‌‌‌‌గా పేరుతెచ్చుకుంది. చాలా మంది ఇండియన్స్ చేతిలో షియోమ స్మార్ట్‌‌‌‌ఫోన్లే ఉన్నాయి. 2019 నాలుగో క్వార్టర్​లో 29 శాతం మార్కెట్‌‌‌‌ షేరు దీనిదే. అమెరికాలో నిషేధానికి గురైనా చైనీస్ వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్ కంపెనీ హువావే టెక్నాలజీస్‌‌‌‌కి ఇండియన్ ప్రభుత్వం గతేడాదే ఆహ్వానించి అనుమతి ఇచ్చింది. ఇలా చాలా చైనీస్ కంపెనీలు ఇండియాలో పాతుకుపోయి ఉన్నాయి. తాజా వివాదంతో ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు, చైనీస్ కంపెనీల నుంచి ఎక్విప్‌‌‌‌మెంట్ పొందడం ఆపివేయాలని నిర్ణయించుకున్నాయి. చైనా కంపెనీల నుంచి ఎక్విప్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను బ్యాన్ చేయాలని ప్రభుత్వ టెల్కోలను డాట్ కూడా కోరింది. ఫ్రయిట్ కారిడార్ ప్రాజెక్ట్‌‌‌‌లో చైనా కంపెనీలను ఇండియన్ రైల్వే కూడా దూరం పెట్టింది. మరోవైపు  జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెహికిల్స్‌‌‌‌కు ఇప్పుడిప్పుడే చైనాలో డిమాండ్ ఏర్పడుతోందని టాటా మోటార్స్ ప్రకటించింది. చైనాలో జేఎల్‌‌‌‌ఆర్ సక్సెస్ టాటాలకు చాలా కీలకం. ఇండియాలో ఆటో సేల్స్ లేక టాటా మోటార్స్ తీవ్రంగా సతమతమవుతోంది. కరోనా వల్ల డిమాండ్ మరింత పడింది. కానీ ఈ సమయంలో సరిహద్దులో వివాదం ఈ కంపెనీని భయపెడుతోంది.

సెలబ్రిటీలను తాకిన యాంటీ చైనా వివాదం…

యాంటీ చైనా వివాదం సెలబ్రిటీలను తాకింది. చైనా ప్రొడక్ట్‌‌‌‌లను బాయ్‌‌‌‌కాట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న సందర్భంలో.. చైనీస్ బ్రాండ్లను ఎండార్స్ చేసుకోవడం ఆపివేయాలని సెలబ్రిటీలను ట్రేడర్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సెయిట్​) ఆదేశించింది. ఒప్పో, షియోమి, వివో లాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తోన్న దీపికా పదుకొనే, రణ్‌‌‌‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీల ఎండార్స్‌‌‌‌ మెంట్స్‌‌‌‌పై ఫోకస్ పెరిగింది. వివోకు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఉండగా.. ఒప్పోకు దీపికా, రణ్‌‌‌‌బీర్, కత్రినా కైఫ్‌‌‌‌లను అంబాసిడర్లుగా ఎంచుకుంది. సల్మాన్ ఖాన్‌‌‌‌ కూడా చైనీస్ బ్రాండ్ రియల్‌‌‌‌మీని ఎండార్స్ చేసుకున్నారు. వారి ఎండార్స్‌‌‌‌మెంట్లపై ఆరా తీసేందుకు సెలబ్రిటీలను కలవాలని ట్రేడర్స్ బాడీ ప్లాన్ చేస్తోంది.

 ఈకామర్స్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్…

ఇటీవలే చైనా పెట్టుబడి దారులు, కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెట్టాలంటే, ముందస్తుగా అన్ని అనుమతులు పొందేలా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. కరోనా అవుట్‌‌‌‌బ్రేక్ తర్వాత ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చైనీస్‌‌‌‌కు అడ్డుకట్ట వేసేలా నిబంధనలు మరింత కఠినతరం చేసి పాలసీల్లో మార్పులు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు ఓలా, స్విగ్గీలతో పాటు ఇండియన్ ఈకామర్స్ కంపెనీల్లో  అలీబాబా, టెన్సెంట్‌‌‌‌లు పెట్టుబడులు పెట్టాయి.