
ముంబై: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి అఖండ భారత్‌గా చేయాలనే బీజేపీ ఆలోచనకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘పాకిస్తాన్‌లోని కరాచీని భారత్‌లో కలిపే సమయం వస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. మేం కూడా చెప్పేదొక్కటే.. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలపాలి. బెర్లిన్ గోడ కూలగా లేనిది.. భారత్, పాక్, బంగ్లాలు కలవడంలో ఆశ్చర్యం ఏముంది? ఒకవేళ ఈ మూడు దేశాలను కలిపి ఒకే దేశంగా మార్చేందుకు బీజేపీ పూనుకుంటే ఆ నిర్ణయానికి మేం మద్దతు తెలుపుతాం’ అని మాలిక్ పేర్కొన్నారు.