సుల్తాన్‌‌‌‌ జోహోర్‌‌‌‌ కప్‌‌‌‌ జూనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ హాకీ టోర్నీలో ఇండియా, పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ డ్రా

సుల్తాన్‌‌‌‌ జోహోర్‌‌‌‌ కప్‌‌‌‌ జూనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ హాకీ టోర్నీలో ఇండియా, పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ డ్రా

జోహోర్‌‌‌‌ (మలేసియా): సుల్తాన్‌‌‌‌ జోహోర్‌‌‌‌ కప్‌‌‌‌ జూనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ హాకీ టోర్నీలో అత్యంత ఆసక్తి రేపిన ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌‌లో ఫలితం తేలలేదు. మంగళవారం పాకిస్తాన్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌ను ఇండియా 3–3తో డ్రాగా ముగించింది. అరైజిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ హుండాల్‌‌‌‌ (43వ ని), సౌరభ్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ కుశ్వా (47వ ని), మన్నీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (53వ ని) ఇండియాకు గోల్స్‌‌‌‌ అందించారు. 

పాక్‌‌‌‌ ప్లేయర్లు హన్నన్‌‌‌‌ షాహిది (5వ ని), సుఫియన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (39, 55వ ని) గోల్స్‌‌‌‌ చేశారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇండియా పాక్‌‌‌‌ సర్కిల్‌‌‌‌లోకి చొచ్చుకుని పోయింది. కానీ మ్యాచ్‌‌‌‌ సాగే కొద్దీ పుంజుకున్న పాక్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ పెనాల్టీ స్ట్రోక్స్‌‌తో విజృంభించింది. దాంతో ఐదో నిమిషంలోనే గోల్‌‌‌‌ కొట్టి ఆధిక్యంలో నిలిచింది.

దీని నుంచి ఇండియా తేరుకునే లోపే పాక్‌‌‌‌ పెనాల్టీని గోల్‌‌‌‌గా మలిచి 2–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. తీవ్ర ఒత్తిడికి లోనైన ఇండియా క్రమంగా తేరుకుని ఫార్వర్డ్‌‌‌‌ లైన్‌‌‌‌లో దాడులు చేసింది. ఫలితంగా పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌‌‌‌ కొట్టి ఆధిక్యంలోకి వచ్చింది. అయితే చివర్లో పాక్‌‌‌‌ కొట్టిన పెనాల్టీని అడ్డుకోలేకపోవడంతో మ్యాచ్‌‌‌‌ డ్రా అయ్యింది.