కాల్పులు బంజేద్దాం : ఇండియా–పాక్‌ కీలక నిర్ణయం

కాల్పులు బంజేద్దాం : ఇండియా–పాక్‌ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్‌‌ యాక్చువల్‌‌ కంట్రోల్‌‌ వద్ద చైనాతో టెన్షన్‌‌ పరిస్ధితులను తగ్గించడంలో సక్సెస్‌‌ అయిన కేంద్రం.. లైన్ ఆఫ్‌‌ కంట్రోల్‌‌ (ఎల్‌‌వోసీ) వెంబడి కూడా శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టింది. చిరకాల ప్రత్యర్ధి పాక్‌‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. రెండు దేశాల డైరెక్టర్‌‌‌‌ జనరల్స్‌‌ ఆఫ్‌‌ మిలిటరీ ఆపరేషన్స్‌‌ (డీజీఎంవో) చర్చలు జరిపి సీజ్‌‌ ఫైర్‌‌‌‌ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.  జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఫైరింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో రెండు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల తరువాత రెండు  దేశాలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. బార్డర్‌‌‌‌లో క్రాస్ ఫైరింగ్‌‌పై డీజీఎంవోలు చర్చించారు. రెండు దేశాలు బార్డర్లలో శాంతిని నెలకొల్పేందుకు సీజ్‌‌ ఫైర్ ఒప్పందానికి అంగీకరించాయి’ అని స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొన్నాయి. అయితే బార్డర్‌‌‌‌లో బలగాల మోహరింపులో ఎలాంటి మార్పులు ఉండబోవని మన ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

ఒప్పందం వెనుక అజిత్‌‌ దోవల్‌‌

కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌‌ దోవల్‌‌ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.