
ఢిల్లీ : ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ఇవాళ సాయంత్రం పాకిస్థాన్ సైన్యం నుంచి విడుదల కాబోతున్నాడు. ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం ఎఫ్ 16 ను … తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో కూల్చిన అభినందన్ వర్దమాన్.. ప్యారాచూట్ సాయంతో కిందకు దిగాడు. ఐతే… అభినందన్ ఆ సమయంలో… ఎల్ఓసీకి అవతల… పీఓకేలో దిగాడు. ఆ తర్వాత అభినందన్ ను స్థానిక గ్రామ ప్రజలు పట్టుకుని.. దాడిచేసి పాక్ సైన్యానికి అప్పగించారు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం… భారత పైలట్ ను ప్రాణాలతో అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పాకిస్థాన్ ఎప్పుడూ శాంతి కోరుకుంటుందని… భారత్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ శాంతికి సంకేతంగానే .. అభినందన్ ను శుక్రవారం విడుదల చేస్తాం అంటూ తమ దేశ పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అభినందన్ విడుదలను తమ చేతికానితనంగా చూడొద్దని అన్నారు.
ఐతే…. పాకిస్థాన్ అభినందన్ ను విడుదల చేయడం శాంతికి సంకేతం ఏమాత్రం కాదని భారత్ అంటోంది. జెనీవా ఒప్పందంలో భాగంగానే పాకిస్థాన్ … అభినందన్ ను తమకు అప్పగిస్తున్నట్టుగా భావిస్తున్నామని చెప్పాయి. యుద్ధ ఖైదీలు పట్టుబడినప్పుడు శత్రు సైనికుడు అయినా.. తమ దేశపు సైనికుడుగానే చూడాలని… ప్రాణాలతో అవతలి దేశానికి అప్పజెప్పాలని జెనీవా ఒప్పందం చెబుతోంది. దానిని పాటించాలని కోరుతూ.. భారత్ సహా… ప్రపంచదేశాలు పాక్ పై ఒత్తిడి చేశాయి. ఐతే.. శాంతి ఆకాంక్ష పేరుతో అప్పగిస్తున్నట్టుగా భావించడం లేదని భారత భద్రతాధికారులు స్పష్టంచేశారు.
అభినందన్ విడుదల చేసినప్పటికీ పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు మద్దతు ఆపకపోతే తమ దాడులు కొనసాగుతాయని చెబుతోంది భారత్.