బుమ్రా, రాహుల్ వచ్చేసారు.. పాక్ తో మ్యాచ్ కి ఆ ఇద్దరిపై వేటు..?

బుమ్రా, రాహుల్ వచ్చేసారు.. పాక్ తో మ్యాచ్ కి ఆ ఇద్దరిపై వేటు..?


 
ఆసియా కప్ లో సూపర్-4లో భాగంగా  టీమిండియా  రేపు  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో సమరానికి సై అంటుంది. మరో వైపు పాకిస్థాన్ ఇప్పటికే సూపర్-4 లో బంగ్లాదేశ్ మీద విజయం సాధించి ఆ ఫామ్ కంటిన్యూ చేయాలని భావిస్తుంది. ఈ   నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. గ్రూప్ దశలో దాయాదుల మధ్య సమరం చూడాలని భావించిన అభిమానులకి వర్షం రూపంలో నిరాశే ఎదురైంది. అయితే సూపర్-4 మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉన్నా.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్ కి రిజర్వ్ డేని కేటాయించారు.  
 
 బూమ్రా, రాహుల్ ఇన్

పాకిస్థాన్‌తో సూపర్‌- 4 మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకు తుది జట్టు కూర్పు కాస్త తలనొప్పిగా మారింది. బుమ్రా జట్టులోకి చేరడంతో ఇప్పుడు ఎవరిపై వేటు పడుతుంది అనే విషయంలో సందిగ్థత నెలకొంది. ఫామ్ లో ఉన్న సిరాజ్ ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ బౌలర్ షమీ, ఆల్ రౌండర్ శార్దూలు ఠాకూర్ లలో ఒకరిపై వేటు పడడం ఖాయం. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే శార్దూలు తుది జట్టులో ఉంటాడు. లేదంటే షమీకి అవకాశం దక్కతుంది. పాకిస్థాన్ పై మ్యాచులో శార్దూలు ఆశించిన  స్థాయిలో రాణించకపోవడం, మరో వైపు షమీ నేపాల్ మీద మ్యాచులో పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఈ ఆదివారం మ్యాచులో షమీ వైపే మొగ్గు చూపించవచ్చు. 

Also Read : భార్యను మళ్లీ పెళ్లి చేసుకోతున్న పాకిస్తాన్ బౌలర్.. కారణం ఏంటంటే..!

ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్ వరల్డ్ కప్ ఆడాలంటే ఆసియా కప్ ప్రాక్టీస్ అవసరం. సాధారణంగా కిషాన్ ప్లేస్ లో రాహుల్ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పటికే కిషాన్ తన చివరి నాలుగు వన్డేల్లో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒకవేళ ఫామ్ ప్రకారం కిషాన్ ని కొనసాగిస్తే శ్రేయాస్ అయ్యర్ మీద వేటు పడక తప్పదు. మరి భారత యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.