భార్యను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న పాకిస్తాన్ బౌలర్.. కారణం ఏంటంటే..!

భార్యను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న పాకిస్తాన్ బౌలర్.. కారణం ఏంటంటే..!

చెల్లికి జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ.. తెలుగు జనానికి పాపులర్ డైలాగ్ ఇది. యమలీల సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే ఈ డైలాగ్ ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. చెల్లికి మళ్లీపెళ్లి ఏంట్రా అంటూ సెటైర్లు వేస్తుంటారు నెటిజన్లు. ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్ రియల్ గా జరుగుతుంది. కాకపోతే చెల్లికి కాదు.. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. అతను ఎవరో తెలుసుకుందామా...

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో టాప్ ఫాస్ట్ బౌలర్ గా.. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా పేరు గాంచిన షాహీన ఆఫ్రిది మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. గతంలో ఈ స్టార్ పేసర్ కి వివాహం జరిగిన సంగతి సంగతి తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిది కూతురుతో   షహీన్ ఆఫ్రిది ఫిబ్రవరి 2023లో మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కెప్టెన్ బాబర్ ఆజం మరియు షాదాబ్ ఖాన్‌తో సహా పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. 2021 లో వీరి నిశ్చితార్ధం జరిగింది.

అఫ్రిదీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగిన తొలి వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ సారి మరింత గ్రాండ్ గా ఈ వివాహం చేసుకోనున్నాడు. సెప్టెంబర్ 19 న మరోసారి ఈ వీరి వివాహం జరగనుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 17 న ముగుస్తుండగా ఆ తర్వాత రెండు రోజులకే ఈ వివాహం జరగనుంది.