సెమీ ఫైనల్స్‌లో టీమిండియా

సెమీ ఫైనల్స్‌లో  టీమిండియా
  • రాణించిన హర్నూర్‌, రాజ్‌ బవా, కౌశల్​
  • అఫ్గాన్‌పై 4 వికెట్లతో గెలుపు
  • అండర్‌–19 ఆసియా కప్‌

దుబాయ్: అండర్–19 ఆసియా కప్‌‌‌‌లో ఇండియా సెమీఫైనల్లో అడుగు పెట్టింది.  సోమవారం జరిగిన తమ గ్రూప్‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌లో ఇండియా  4 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌ను ఓడించింది. గత మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ చేతిలో ఓడటంతో  నాకౌట్‌‌‌‌ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ పోరులో  మన కుర్రాళ్లు సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశారు. అఫ్గాన్‌‌‌‌ సవాల్‌‌‌‌ను పక్కాగా తిప్పికొట్టారు.  టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌‌‌‌ చేసిన అఫ్గాన్‌‌‌‌ నిర్ణీత 50 ఓవర్లలో 259/4 స్కోరు చేసింది. ఓపెనర్లు సులైమన్‌‌‌‌ అరాబజయ్‌‌‌‌ (18), మొహమ్మద్‌‌‌‌ ఇషాక్ (19), వన్‌‌‌‌డౌన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ అల్లా నూర్‌‌‌‌ (26) తొందరగానే ఔటైనా.. ఇజాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ అహ్మద్‌‌‌‌జాయ్‌‌‌‌ (86 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ సులైమన్‌‌‌‌ సఫి (73) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 88 రన్స్‌‌‌‌ జోడించి టీమ్‌‌‌‌కు మంచి స్కోరు అందించారు. 

ఇండియా బౌలర్లలో రాజ్‌‌‌‌వర్ధన్‌‌‌, రాజ్‌‌‌‌బవా, విక్కీ ఒస్వాల్, కౌశల్‌‌‌‌ తాంబే తలో వికెట్‌‌‌‌ పడగొట్టారు. అనంతరం ఇండియా 48.2 ఓవర్లలో 262/6 స్కోరు చేసి గెలిచింది. ఛేజింగ్‌‌‌‌లో ఓపెనర్లు హర్నూర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (65), రఘువంశి (35) ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 104 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌తో మంచి స్టార్ట్​ ఇచ్చారు.  కానీ, నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (4/43) దెబ్బకు ఈ ఇద్దరితో పాటు వన్‌‌‌‌డౌన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ షేక్‌‌‌‌ రషీద్ (6), కెప్టెన్‌‌‌‌ యష్‌‌‌‌ ధూల్‌‌‌‌ (26), నిశాంత్‌‌‌‌ (19), ఆరాధ్య యాదవ్‌‌‌‌ (12)  వెంటవెంటనే  ఔటవడంతో ఇండియా 197/5 స్కోరుతో కష్టాల్లో పడ్డది. ఈ టైమ్​లో​ రాజ్‌‌‌‌ బవా (43 నాటౌట్), కౌశల్‌‌‌‌ తాంబే (35 నాటౌట్‌‌‌‌)  ఆరో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌తో టీమ్‌‌‌‌ను గెలిపించారు. బ్యాటింగ్​, బౌలింగ్​లో రాణించిన  కౌశల్‌ తాంబేకి ప్లేయర్‌ ఆఫ్‌  ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.  

పాకిస్తాన్​కు టాప్​ ప్లేస్​​​

మరో మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 21 రన్స్‌‌‌‌ తేడాతో యూఏఈని ఓడించింది. గ్రూప్‌‌‌‌–ఎలో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లోనూ నెగ్గి 6 పాయింట్లతో  టాపర్‌‌‌‌గా నిలిచింది. 4 పాయింట్లతో సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించిన ఇండియాతో పాటు సెమీస్‌‌‌‌ చేరుకుంది. గ్రూప్‌‌‌‌–బిలో బంగ్లాదేశ్‌‌‌‌, శ్రీలంక అండర్‌‌‌‌–19 టీమ్స్‌‌‌‌ కూడా సెమీస్‌‌‌‌ బెర్తు సాధించాయి. మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగే  మ్యాచ్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో సెమీస్‌‌‌‌లో ఇండియా పోటీ పడుతుంది.

స్కోర్స్‌

అఫ్గానిస్తాన్‌: 50 ఓవర్లలో 259/4 (ఇజాజ్‌ 86 నాటౌట్‌,  సఫి 73, కౌశల్‌ 1/25, విక్కీ 1/35).
ఇండియా: 48.2 ఓవర్లలో 262/6 (హర్నూర్‌ 65, రాజ్‌ బవా 43 నాటౌట్‌, కౌశల్‌ 35 నాటౌట్‌, నూర్‌ అహ్మద్‌ 4/43).