ఫిన్​టెక్​లోనూ దూసుకెళ్తున్నం...

ఫిన్​టెక్​లోనూ దూసుకెళ్తున్నం...
  • ఫిన్​టెక్​లోనూ దూసుకెళ్తున్నం...
  • యూనికార్న్స్​లో మనది మూడో ప్లేస్​
  • మొదటి రెండు ప్లేస్​లలో యూఎస్​, యూకే

వెలుగు బిజినెస్​ డెస్క్: ఫైనాన్షియల్​ టెక్నాలజీ (ఫిన్​టెక్​) యూనికార్న్​ల ర్యాంకింగ్​లో ఇండియా మూడో ప్లేస్​లో నిలుస్తోంది. మొదటి రెండు ప్లేస్​లలో యూఎస్​, యూకేలు ఉన్నాయని గ్లోబల్​ రీసెర్చ్​ సంస్థ స్టాటిస్టా వెల్లడించింది. యూఎస్​లో 134 యూనికార్న్ ఫిన్​టెక్​​ కంపెనీలుండగా, యూకేలో 27 ఉన్నాయి.  ఈ ఏడాది ఇప్పటిదాకా 17 ఫిన్​టెక్ ​యూనికార్న్​ కంపెనీలతో ఇండియా మూడో ప్లేస్​లో నిలుస్తోంది. మార్కెట్​ విలువ పరంగా చూస్తే అతి పెద్ద ఫిన్​టెక్​ కంపెనీలు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నట్లు స్టాటిస్టా తెలిపింది. 

వీసా, పేపాల్​, మాస్టర్​కార్డ్​ వంటి టాప్​  ఫిన్​టెక్​ కంపెనీలన్నీ అమెరికాలోనివే. గ్లోబల్​గా 15 హయ్యస్ట్​ వాల్యూడ్​ పిన్​టెక్ ​కంపెనీలుంటే ఇందులో 8 అమెరికా కంపెనీలే. ఈ 8 యూనికార్న్​ కంపెనీల మొత్తం మార్కెట్​ వాల్యూ 1.2 ట్రిలియన్​ డాలర్లు. మార్కెట్​ వాల్యూ జాబితాలో చైనా రెండో ప్లేస్​లో నిలుస్తోంది. ఈ దేశంలో 8 ఫిన్‌‌టెక్  యూనికార్న్​ కంపెనీలే ఉన్నాయి. టెన్సెంట్​, యాంట్​ ఫైనాన్షియల్​ వంటి పెద్ద  కంపెనీల వల్ల ఆ దేశంలోని ఫిన్​టెక్​ కంపెనీల మార్కెట్​ వాల్యూ 338.92 బిలియన్​ డాలర్లకు చేరినట్లు స్టాటిస్టా డేటా వెల్లడిస్తోంది.

సిలికాన్​ వ్యాలీలోనే ఎక్కువ....

ప్రపంచంలోనే పెద్ద టెక్నాలజీ కంపెనీలకు వేదికగా నిలిచిన సిలికాన్​ వ్యాలీలోనే ఎక్కువ ఫిన్​టెక్​ కంపెనీలు కూడా ఉన్నాయి. మెటా, యాపిల్​, గుగుల్​, అమెజాన్​ వంటి దిగ్గజ టెక్​ కంపెనీలతోపాటు, సెకోవియా క్యాపిటల్​, యాండ్రీసీన్​ హోరోవిట్జ్​ వంటి వెంచర్​ కంపెనీలు కూడా సిలికాన్​వ్యాలీకి చెందినవే కావడం విశేషం. 
ఇండియాలో జెరోధా, బిల్​డెస్క్​, పేటీఎం, రేజర్​పే, పైన్​ల్యాబ్స్​ వంటి ఫిన్​టెక్​ కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి. 

పేటీఎం 2023–24 క్యూ2 లో రూ. 2,519 కోట్ల రెవెన్యూ సాధించింది. ఈ రెవెన్యూ అంతకు ముందు ఏడాదిలోని రూ. 1,914 కోట్లతో పోలిస్తే 32 శాతం ఎక్కువ. ​పేటీఎంకు  రెండో క్వార్టర్లో రూ. 292 కోట్ల నికర నష్టం వచ్చింది. తాజా  క్యూ2లో కంపెనీ  నష్టాలు బాగా తగ్గాయి. 

యూకేలోని యూనికార్న్​ ఫిన్​టెక్​ కంపెనీల జాబితాలో,  ఆన్​లైన్​ బ్యాంకింగ్​ స్టార్టప్​ రెవోలట్​(33 బిలియన్​ డాలర్లు), క్రిప్టో వ్యాలెట్​ ప్రొవైడర్​ బ్లాక్​చెయిన్​.కామ్​ (14 బిలియన్​ డాలర్లు), డిజిటల్​ పేమెంట్స్​ గ్రూప్స్​ చెక్​అవుట్​.కామ్​ (11 బిలియన్​ డాలర్లు) ర్యాపిడ్​ (8.75 బిలియన్​ డాలర్లు), సమప్​ (8.5 బిలియన్​ డాలర్లు) ఉన్నాయని స్టాటిస్టా తెలిపింది.

 యూకేలోని మోన్జో, స్టార్లింగ్​ వంటి స్టార్టప్స్​ బ్యాంకింగ్  ​రంగంలో డిజిటల్​ ఓన్లీ ఆఫరింగ్స్​ను అందిస్తున్నాయి. మరోవైపు చైనాలోని అలీబాబా, టెన్సెంట్​లు తమ సొంత మొబైల్​వ్యాలెట్లు అలీపే, వియ్​చాట్​పేలను తెచ్చాయి.