మోడీ చేతికి స్విస్ ఖాతాల వివరాలు.. 15 లక్షలు వేస్తారా మరి…!

మోడీ చేతికి స్విస్ ఖాతాల వివరాలు.. 15 లక్షలు వేస్తారా మరి…!

నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానన్న ప్రధానమంత్రి నరేంధ్రమోడీ హామీ ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో స్విస్ బ్యాంకుల్లో భారత్ కు చెందిన నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి ఎకౌంట్ లో 15లక్షల నగదును వేస్తానన్నారు. అయితే గత ఐదు సంవత్సరాలలో అటువైపుగా అడుగులు పడలేదు. కానీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన మోడీ… స్విస్ బ్యాంకుల్లో ఎవరు నగదును దాచుకున్నారో తెలుసుకోగలిగారు. అందుకుగాను స్విట్జర్ ఫెడర్ ట్యాక్స్ అడ్మనిస్ట్రేషన్ (FTA) ఈ వివరాల ఫస్ట్ లిస్ట్ ను భారత్ కు అందించారు. మరోక లిస్ట్ ను 2020 లో భారత్ కు అందించనున్నట్లు FTAఅధికారులు తెలిపారు. అయితే ఆ వివరాలను ప్రభుత్వం తో తప్ప మరెవరితో పంచుకోమని అన్నారు FTA. భారత ప్రభుత్వానికి ఫస్ట్ లిస్ట్ వచ్చింది. అయితే రెండో లిస్ట్ వచ్చాక అందులో ఉన్న పేర్లను మోడీ ప్రభుత్వం బయటకు చెప్తుందా లేదా అని వేచిచేడాల్సిందే.