
GNG Electronics IPO: ప్రపంచంలోని ఇతర మార్కెట్ల కంటే ఎక్కువ సంఖ్యలో భారత ఈక్విటీ మార్కెట్లలోకి ఎక్కువ సంఖ్యలో ఐపీవోలు వస్తున్నాయని తేలింది. ప్రస్తుతం 2025లో ఐపీవోల జోరు నెమ్మదిగా స్టార్ట్ అయినప్పటికీ జూలైలో తిరిగి పుంజుకుంది. పైగా ఇటీవల వస్తున్న ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించటం వాటి క్రేజ్ పెంచుతోంది. ఇన్వెస్టర్లు అనిశ్చిత మార్కెట్లలో ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు ఎక్కువగా ప్రయత్నించటం గతంలో కూడా మనం గమనించాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.460 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.400 కోట్లకు తాజా షేర్ల జారీ ఉండగా మిగిలిన మెుత్తం కోసం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో జూలై 30న మార్కెట్లో లిస్టింగ్ కానుంది.
ALSO READ : క్రిప్టో ఎక్స్ఛేంజీలపై హ్యాకర్ల వరుస దాడులు.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..!
ఐపీవో ఇష్యూ జూలై 23 నుంచి 25వరకు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఇష్యూ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.225 నుంచి రూ.237గా ప్రకటించింది. ఎవరైనా ఇన్వెస్టర్ పాల్గొనాలంటే 63 షేర్లు కలిగిన లాట్ ను రూ.14వేల 175 రేటుకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
గ్రేమార్కెట్లో దూకుడు..
ఇన్వెస్టర్ గెయిన్స్ సమాచారం ప్రకారం జూలై 23 అంటే రేపు సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతున్న ఐపీవో ప్రస్తుతం గ్రేమార్కెట్లో షేరుకు రూ.92 ప్రీమియం పలుకుతోందని వెల్లడైంది. ఇదే రేటు లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే ఒక్కో షేరు రూ.329 వద్ద మార్కెట్లో జాబితా అవ్వొచ్చని సమాచారం. ఇన్వెస్టర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా జీఎంపీ రోజువారీ మారుతుందని గమనించాలి.
కంపెనీ వ్యాపారం..
2006లో స్థాపించబడిన GNG ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ICT పరికరాలకు రిఫర్బిషింగ్ సేవలను అందిస్తుంది. కంపెనీ కర్యకలాపాలు ఇండియాతో పాటు అమెరికా, యూరప్, ఆఫ్రికా, యూఏఈ వ్యాప్తంగా విస్తరించాయి. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండ్ పేరు కింద తన సేవలను కొనసాగిస్తోంది. విజయా సేల్స్, హెచ్ పీ, లెనోవో వంటి సంస్థలకు దేశంలో ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ బైబ్యాక్ కోసం సేవలను అందిస్తోంది.