సైబర్ నేరగాళ్ల వలలో తిరుపతి అడ్వకేట్ : లింక్ క్లిక్ చేయగానే లక్షలు మాయం

సైబర్ నేరగాళ్ల వలలో తిరుపతి అడ్వకేట్ : లింక్ క్లిక్ చేయగానే లక్షలు మాయం

 ఫోన్​ కాల్​ వస్తే చాలు.. సైబర్​ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని... ..  తెలియని నెంబర్లనుంచి ..మీకు ఫోన్​కాల్ ​వస్తే జాగ్రత్త.. ఇది సైబర్​నేరగాళ్ల పన్నాగం కావచ్చు..  అంటూ వాయిస్​ వినపడుతుంది.రోజూ ఇది వింటూనే ఉంటాం కానీ మోసపోతున్నాం.. ఇప్పుడు అలానే తిరుపతి చెందిన అడ్వకేట్​ సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే. .  .

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతికి ఓ అడ్వకేట్​ను   మోసం చేసి.... ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షల 50 వేల 999 రూపాయిలను  దోచేశారు. 

 పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అడ్వకేట్ ఫోన్ నెంబర్ నుంచి APK అప్లికేషన్ పంపారు. ఆ  అప్లికేషన్ ఓపెన్ చేయడంతో 3 అకౌంట్లకు సంబంధించిన నగదు 8 అకౌంట్లోకి బదిలీ అయింది. ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్​ మోసపోయానని గ్రహించి  సైబర్ హెల్ప్ డెస్క్ 1930 కు కు ఫోన్​ చేశారు. 

బాధితుడు పేరూరు పంచాయతీ, విద్యానగర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సైబర్​ క్రిమినల్స్ బారిన తిరుపతి అడ్వకేట్​  తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్​ సీఐ చిన్న గోవిందు తెలిపారు. 

ఆన్‌లైన్‌ వ్యవహారాలకు సంబంధించి దేనినీ, ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని తిరుపతి పోలీసులు సూచించారు. తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని ఇంటర్నేషనల్ కాల్స్ లిఫ్ట్ చేయవద్దని చెబుతున్నారు. కొందరు కేటుగాళ్లు విదేశీ కోడ్ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి కాల్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలని అంటున్నారు. 

మెసేజ్‌లు, స్పామ్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవటం కన్నా.. అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు. అవసరమైతే అలాంటి కాల్స్, మెసేజ్‌లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.