దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరోసారి 12 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి. దేశంలో కొత్తగా 12 వేల 899 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్ర నుంచే 3 వేల 883 కేసులు.. 2 మరణాలు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిమరోవైపు యాక్టివ్ కేసులు 72 వేలు దాటాయి. మరో 8 వేల 518 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీలు తక్కువగా ఉండటంతో.. యాక్టివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా 1,534 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ భారిన పడి ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 7.71గా ఉంది. ప్రస్తుతం దేశ రాజధానిలో 5,119 యాక్టివ్ కేసులు  ఉన్నాయిఇప్పటివరకు 196.14 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.