రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జిన్ పింగ్‎కు రహస్య లేఖ.. అసలు విషయం బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం..!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జిన్ పింగ్‎కు రహస్య లేఖ.. అసలు విషయం బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం..!

న్యూఢిల్లీ: ఇండియా-చైనా సంబంధాలను పునరుద్ధరించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రహస్య లేఖ పంపారనే నివేదికలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జిన్‌పింగ్ సీక్రెట్‎గా లెటర్ పంపించారనేది పూర్తిగా అవాస్తమని కొట్టిపారేసింది. మీడియా ప్రతినిధులు ఇలాంటి వార్త కథనాలు రాసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. 

భారత్, అమెరికా మధ్య టారిఫ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2025, మార్చిలో రాష్ట్ర ద్రౌపదీ ముర్ముకు రహస్యంగా లేఖ పంపారని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదించింది. జిన్‌పింగ్ తన లేఖలో చైనా ప్రయోజనాలకు హాని కలిగించే ఏవైనా యూఎస్ ఒప్పందాల గురించి ఆందోళన వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. 

తాజాగా.. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దృష్టికి తీసుకెళ్లారు మీడియా ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా-చైనా సంబంధాలను పునరుద్ధరించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రహస్య లేఖ పంపించారనే నివేదికను మేం కూడా చూశాం. ఆ కథనం పూర్తిగా తప్పు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మీడియా మిత్రులు తగిన బాధ్యత వహించాలని సూచించారు. 

►ALSO READ | టారిఫ్‎ల వల్ల ఇండియా, చైనా, రష్యాను కోల్పోయాం: ట్రంప్‎కు జ్ఞానబోధ అయినట్లు ఉంది..!

2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇండియా, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్ పై అమెరికా భారీగా సుంకాలు విధించడంతో తిరిగి చైనా, ఇండియా దేశాల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోంది. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాలు ముందుకు రావడం.. భారత్‎పై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను చైనా ఖండించడం వంటి పరిణామాలు రెండు దేశాలను మళ్లీ ఒక్కటి చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగానే.. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లడం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం కావడంతో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుకుంది. ఇండియా, చైనా స్నేహితులుగా ఉండాలని, ఏనుగు, డ్రాగన్ కలిసి ఉండాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్ అనడం ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తోంది.