పది శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు

పది శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి నిన్న ఒక్కరోజే 40వేల 863 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో పాజిటివిటి రేటు 10.21శాతం గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసులు 5 లక్షల 90 వేల 611గా ఉన్నాయి.

ఇటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహమ్మారి విస్తరించిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కొత్తవేరియంట్ విజృంభిస్తోంది. అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 513 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడులో రోజురోజుకు కేసులు పెరిగుతున్నాయి.