ఇండియాలో కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు

భారతదేశాన్ని ఇంకా కరోనా భూతం వీడడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తగ్గుముఖం పడుతోందని అనుకుంటున్న క్రమంలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 16 వేల 159 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 5 లక్షల 23 వేల 270కి చేరుకుంది.

15 వేల 394 మంది రోగులు కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212గా ఉన్నాయి. మహారాష్ట్రలో మంగళవారం 3 వేల 098 కేసులు, ఆరు మరణాలు సంభవించాయి. ముంబాయిలో రోజువారి కేసుల్లో తగ్గుముఖం పట్టినా.. ఇతర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరిగింది. ఢిల్లీలో మంగళవారం 615 కొత్త కేసులు రికార్డయ్యాయి. 3.89 శాతం పాజిటివ్ రేటు ఉంది. ఢిల్లీలో వైరస్ సోకి ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు కేంద్ర  వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది.