భారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు

భారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు

కరోనా మరోసారి విస్తృతంగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహహ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా భారత్ లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58097 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న 37వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే.. కరోనా కేసుల్లో 55 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2135 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందింది. 

మరోవైపు పెరుగుతున్న కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ  రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేసింది. దీంతో పలు రాష్ట్రాలు కూడా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్,న్యూఇయర్ వేడుకలపై నిబంధనలు పెట్టారు. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు, ఫంక్షన్లు వేడుకలపై నిషేధం విధించారు. ఇటు  దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌ను కూడా నిరంతరం వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 15-18 ఏళ్లలోపు వారికి టీకాలు వేస్తున్నారు. భారతదేశంలో 147 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. ప్రతీ ఒకరు తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాయి. 

ఇవి కూడా చదవండి:

కరోనా బారిన పడిన షిప్

ఆక్సిజన్ అవసరం 200 మందిలో ఒక్కరికే