9 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌‌ 

9 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌‌ 

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లో ఈ ఏడాది మొదటి క్వార్టర్లో లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన పెద్ద ఆఫీస్ స్థలాల లీజింగ్ 44 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్  తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం, గత ఏడాది నమోదైన 26 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది 69 శాతం ఎక్కువ.  మొత్తం 59 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ లావాదేవీల్లో పెద్ద ఆఫీసు స్థలాల వాటానే 75 శాతంగా ఉంది. 

వర్క్‌‌ప్లేస్ వ్యూహాలు, సమర్థత, ఈఎస్​జీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన స్థలాల వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. 50 వేల నుంచి లక్ష చదరపు అడుగుల పరిమాణం గల మధ్యతరహా కార్యాలయ స్థలాలు పది లక్షల చదరపు అడుగుల లీజింగ్‌‌తో 17 శాతం వాటాను దక్కించుకున్నాయి. 50 వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న ఆఫీసుల వాటా ఎనిమిది శాతం ఉంది.